
నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పద్మావతి
కర్నూలు(హాస్పిటల్): గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీగా ప్రిన్సిపాల్‌గా ఆర్.పద్మావతి నియమితులయ్యారు. గుంటూరులో గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆమె కర్నూలుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం కర్నూలులో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా ఎన్.మంజుల విధులు నిర్వహిస్తున్నారు.
మసీదుపురంలో
వ్యక్తి అనుమానాస్పద మృతి
మహానంది: మసీదుపురం గ్రామానికి ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...గ్రామానికి చెందిన మునగాల రామసుబ్బారెడ్డి(53)కి అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఒంటెద్దు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వడ్డె సంపంగి నారాయణ, పెరుమాళ్ల చెన్నరాయుడు, నులకచందనం రాముడులతో రామసుబ్బారెడ్డి కలిసి ఈశ్వర్‌రెడ్డి బావి వద్ద బుధవారం రాత్రి మద్యం సేవించారు. రాత్రి 10.30 గంటలకు భర్త ఇంటికి రాకపోవడంతో భార్య తులశమ్మ ఫోన్ చేస్తే మొబైల్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అయితే రామసుబ్బారెడ్డి గురువారం ఉదయం బావిలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న కుటుంబీకులు బావి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా అతని శరీరమంతా గాయాలున్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి, సిబ్బంది గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతిని భార్య తులశమ్మ నలుగురిపై అనుమానం వ్యక్తం చేయడంతో, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.