
కొలువుదీరిన హజరత్ అబ్బాస్ పీర్లు
బనగానపల్లె రూరల్: మొహర్రం సందర్భంగా పట్టణంలోని ఆస్థానంలో హజరత్ అబ్బాస్ పీర్లు కొలువు దీరాయి. బనగానపల్లె నవాబు వంశీయులు నవాబు మీర్ ఫజల్ అలీఖాన్ ఆధ్వర్యంలో నవాబు ఇంటి నుంచి భక్తి గీతాలు అలపిస్తూ ఆస్థానం వద్దకు పీర్లను తీసుకొచ్చారు. పీర్లను ముస్తాబు చేసి, పూలదట్టిలు సమర్పించారు. అనంతరం షియా మతస్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మొహర్రం వేడుకల్లో భాగంగా జూలై 3వ తేదీన చిన్న సరిగెత్తు, 4న మధ్య సరిగెత్తు, 6న జుర్రేరువాగులో పీర్ల నిమజ్జనంతో మొహర్రం వేడుకలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి హజరత్ అబ్బాస్ పీర్లను దర్శించుకుని ప్రత్యేక ఫాతెహాలు సమరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొహర్రం వేడుకలు ముంబాయి తరువాత బనగానపల్లె పట్టణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో హిందూ, ముస్లిం సోదరులు ఐకమత్యంగా నిర్వహస్తారన్నారు. ఈ వేడుకలకు మొట్టమొదటి సారిగా ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. మొహర్రం సందర్భంగా ఆస్థానాన్ని ప్రత్యేక విద్యుత్‌దీపాలంకరణ చేశారు. బనగానపల్లె సీఐలు ప్రవీణ్‌కుమార్, మంజునాథ్‌రెడ్డిల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.