
మెరుగైన సేవలు అందించాలి
గత ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండేలా గ్రామాల్లోనే సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసింది. పనుల నిమిత్తం ప్రజలు ఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఉండేది. అధికారులే గ్రామాలకు వచ్చి సేవలు అందించేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకుండా పోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బందులు లేకుండా అధికారులు, ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
– ఆర్థర్‌సైమాన్, ఎంపీపీ, గోస్పాడు
భవనాలను
అందుబాటులోకి తేవాలి
సచివాలయం, రైతుభరోసా కేంద్రం, హెల్త్‌క్లినిక్‌లకు నూతన భవనాల ఏర్పాటుకు గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసింది. అయితే ఆభవనాలు పూర్తయి ఏడాదికి పైగా కాలం గడుస్తున్నా వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్లక్ష్యం చేస్నున్నారు. ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉండే నూతన భవనాలు నిరుపయోగంగా మారుతున్నాయి.
– గడ్డం ప్రసాద్‌యాదవ్, పసురపాడు

మెరుగైన సేవలు అందించాలి