
నాటుసారా స్థావరంపై ఎకై ్సజ్ దాడులు
కర్నూలు: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా కర్నూలు ఎకై ్సజ్ పోలీసులు కల్లూరు మండలం కొల్లంపల్లి తండా శివారులోని నాటుసారా స్థావరంపై దాడులు నిర్వహించి బట్టీలను ధ్వంసం చేశారు. కర్నూలు ఎకై ్సజ్ సీఐ చంద్రహాస్ తన సిబ్బంది చంద్రపాల్, రాజు, రామలింగయ్య, మధు, ఈరన్న తదితరులతో కలసి బుధవారం ఉదయం నాటుసారా స్థావరంపై దాడి చేసి సుమారు సారా తయారీకి ఉపయోగించే వెయ్యి లీటర్ల బెల్లం ఊటతో పాటు 30 లీటర్ల నాటుసారాను నేలపాలు చేశారు. అదే గ్రామానికి చెందిన లోకేష్ నాయక్, లక్ష్మణ్ నాయక్ తదితరులు సారా బట్టీలను నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని, వారిపై కేసు నమోదు చేసి త్వరలో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపనున్నట్లు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో అవగాహన సభ నిర్వహించారు. నాటుసారా తయారీ, రవాణా విక్రయాలు జరపడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. నాటుసారా తయారీ మానుకుని ప్రత్యామ్నాయ ఉపాధి ద్వారా జీవనం సాగించాలన్నారు. నాటుసారాను నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.