
ట్రాక్టర్ ప్రమాదంలో రైతు మృతి
తుగ్గలి: ట్రాక్టర్ ప్రమాదంలో ఓ రైతు మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలోని అమినాబాద్‌లో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రైతు మోటుపల్లి శ్రీనివాసులు తన పొలంలో ట్రాక్టర్‌తో గుంటెక పాస్తుండగా టైరు రాయి ఎక్కడంతో కింద పడ్డాడు. ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ టైరు మీద ఎక్కింది. వెంటనే అతను ఇంటికి ఫోన్ చేసి ప్రమాదం గురించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో జి.ఎర్రగుడి సమీపంలోకి వెళ్లగానే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తుగ్గలి పోలీసులు తెలిపారు.