
సిక్కుల అభ్యున్నతికి సిక్కు సొసైటీ కృషి
మిర్యాలగూడ అర్బన్ : సిక్కుల అభ్యున్నతికి తెలంగాణ సిక్కు సొసైటీ కృషి చేస్తుందని ఎస్పీఎఫ్ రిటైర్డ్ డీజీపీ తేజ్‌దీప్‌కౌర్ మీనన్ అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని టాకారోడ్డులో గల సిక్కుల దేవాలయాన్ని ఆమె సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కాలనీలో పర్యటించి సిక్కుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సిక్కుల ఆర్థిక, సామాజిక, విద్యాభివృద్ధికి సోసైటీ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మిర్యాలగూడలో ఉమెన్స్ డెవలప్‌మెంట్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని.. అందులో సిక్కు మహిళలుకు కుట్టు మిషన్, చిన్నారులకు విద్య, కంప్యూటర్ శిక్షణ అందస్తామన్నారు. 13న ప్రత్యేకంగా హెల్త్ క్యాంపు నిర్వహస్తామన్నారు. కార్యక్రమంలో సిక్కు సొసైటీ సభ్యులు పర్విందర్ సింగ్ కోహ్లి, కిరణ్‌సింగ్, మాన్‌సింగ్, హర్బల్‌సింగ్, జలహార్‌సింగ్, హజార్‌సింగ్ పాల్గొన్నారు.
సిక్కుల జీవన స్థితిగతుల పరిశీలన
చిట్యాల : సిక్కుల జీవన స్థితిగతులు, జీవన అధ్యయనంలో భాగంగా చిట్యాల మున్సిపాలిటీలో రాష్ట్ర సిక్కు సొసైటీ చైర్మన్, ఎస్పీఎఫ్ రిటైర్డ్ డీజీపీ తేజ్ దీప్‌కౌర్ మీనన్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా చిట్యాలలో సిక్కుల ఇళ్ల వద్దకు వెళ్లి వారు చేస్తున్న వృత్తి, ఆర్థిక, జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పలువురి దీనస్థితి చూసి చలించిపోయారు. గుండె జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి ఆపరేషన్‌కు సహకరిస్తానని భరోసా ఇచ్చారు. తాత్కాలిక అవసరాలకు రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.

సిక్కుల అభ్యున్నతికి సిక్కు సొసైటీ కృషి