
శిక్షణతో మెరుగైన బోధన అందించాలి
నల్లగొండ : వృత్తి నైపుణ్యం కోసం ఇస్తున్న శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు మెరుగైన పద్ధతిలో బోధించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని ఆమె తనిఖీ చేసి మాట్లాడారు. రిసోర్స్ పర్సన్లకు, జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. డీఈఓ భిక్షపతి మాట్లాడుతూ ఈనెల 17 వరకు మొదటి విడత, 20 నుంచి 24 వరకు రెండవ విడత, 27 నుంచి 30 వరకు మూడవ విడత శిక్షణ ఉంటుందని తెలిపారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్లు ఆయా పాఠశాలల పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతంలో శిక్షణ ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్లు నల్లగొండ ఎంఈఓ అరుంధతి, నకిరేకల్ ఎంఈఓ నాగయ్య, చిట్యాల ఎంఈఓ సైదయ్య పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి