
ఈఏపీసెట్‌లో ‘శ్రీచైతన్య’ ప్రభంజనం
ఖమ్మం సహకారనగర్: ఈఏపీసెట్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆదివారం అభినందించి మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో వి. కుషాల్ 28వ ర్యాంకు, వై. నిషాంత్ 61, డి. దుర్గా గుజిరి 222, ఏ. సాయితేజ 253, కె. విశావని వాగ్దేవి 301, బి. రిషిత 321, ఆర్. జోష్ణవ్ కుమార్ 334, కె. సాయిదివ్య వర్షిత 423, జి. సాయి ప్రణవి 491, కె. హాసిని 575, వి. ప్రణతి, కె.తేజస్విని 653, బి. ఈశ్వర్ గుప్తా 855, యు. వశిష్ఠ 908, బి. మనిశేషు 968, డి. శ్రీలేఖ 1195, పి. స్మైలికరెడ్డి 1262, కె. నిషాంత్‌రెడ్డి 1394, ఎల్. మనోహర్ 1422, జి. అలేఖ్య 1482వ ర్యాంకు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ బి. సాయిగీతిక, డీజీఎం సీహెచ్. చేతన్ మాధుర్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్‌ఆర్‌ఎస్‌డీ వర్మ, డీఎన్ జె. కృష్ణ, ఏజీఎంలు తదితరులు పాల్గొన్నారు.