
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
నాంపల్లి : రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నాంపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు ఇబ్బంఇ పెడుతున్నారని రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేయాలని, ట్రక్‌షిట్ కూడా తీసుకొచ్చి రైతులకు వెంటనే డబ్బులు అందేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ్, ఆర్డీఓ శ్రీదేవి, తహసీల్దార్ దేవ్‌సింగ్, గట్టుపల్లి నర్సిరెడ్డి, నితీష్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి