శర్వానంద్‌, సిద్ధార్ధ్‌ల‌ మహా సముద్రం’ రిలీజ్‌ డేట్‌ ఖరారు

Sharwanand, Siddharth Maha Samudram Release Date - Sakshi

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మహా సముద్రం’. రొమాంటిక్‌ ల‌వ్ అండ్ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్నఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఎగసిపడే సముద్రపు అలల్లో, మీరు కొలవలేనంత ప్రేమని పరిచయం చేయడానికి వస్తున్నాం.’ అంటూ ‘మహా సముద్రం’ టీమ్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న ‘మహాసముద్రం’ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొంది. మహా సముద్రంతో దాదాపు ఏడేళ్ల విరామం తరువాత సిద్ధార్థ్‌ తెలుగు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. చదవండి: శర్వానంద్‌ సినిమాలో పాయల్‌ ‘స్పెషల్‌’..?

ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాషల్లో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇదిలా ఉండగా మహా సముద్రంతో పాటు మరో రెండు తెలుగు చిత్రాలు ఆగష్టు నెలలో ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించాయి. అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా ఆగష్టు 13న రిలీజ్‌ అవ్వనుండగా.. వెంకటేష్, వరుణ్ తేజ్ల ‘ఎఫ్ 3’లాగష్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రెండు క్రేజీ సినిమాల మధ్య విడుదలవుతున్న ‘మహా సముద్రం’ బాక్సాఫీస్ అనే మహా సముద్రంలో ఏ మేరకు తీరం చేరుతుందో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top