
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు కోట్లల్లో ఆస్తులున్నాయి. ముంబై, లాస్ ఏంజిల్స్, గోవాలో విలువైన ప్రాపర్టీస్ ఉన్నాయి. అయితే తాజాగా ఆమె తన రెండు అపార్ట్‌మెంట్లను అమ్మేసిందట. అంతే కాదు, ముంబైలోని తన ఆఫీసు భవంతిని కూడా ఖాళీగా ఎందుకు ఉంచడమని అద్దెకిస్తోందట. ఈ మేరకు ఆంగ్ల మీడియా కథనాలు ప్రచురిస్తోంది. దీని ప్రకారం..
మహారాష్ట్రలోని అంధేరీలో ఓ బిల్డింగ్‌లో ఏడో అంతస్తులోని ఒక ఫ్లాట్‌ను రూ. 3 కోట్లకు ఈ ఏడాది మార్చిలో అమ్మేసింది ప్రియాంక చోప్రా. అదే అంతస్తులోని విశాలమైన ఫ్లాట్‌ను రూ.4 కోట్లకు విక్రయించింది. ఈ రెండింటి అమ్మకాల వల్ల ప్రియాంక చేతికి ఏడు కోట్లు వచ్చాయి. అలాగే ప్రియాంక.. ఒషివారాలోని రెండంతస్తుల ఆఫీసును అద్దెకిస్తున్నట్లు తెలుస్తోంది. 2040 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ భవనంలో అద్దెకు దిగాలంటే నెలకు రూ.2.11 లక్షలు కట్టాల్సిందే.
ఇలా ఫ్లాట్లు అమ్మడం, కొనడం ప్రియాంకకు కొత్తేమీ కాదు. గతేడాది ఫిబ్రవరిలోనూ పశ్చిమ అంధేరీలోని కరణ్ అపార్ట్‌మెంట్‌లో ఓ ఇంటిని రెండు కోట్ల రూపాయలకు అమ్మేసిన విషయం తెలిసిందే.కాగా ప్రియాంక గతంలో ముంబైలోని జుహు అపార్ట్‌మెంట్‌లో ఉండేది. 2018లో నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న ఆమె, కొంతకాలం పాటు భర్తతో కలిసి అక్కడే నివసించింది. తర్వాత లాస్ ఏంజిల్స్‌లో ఓ ఖరీదైన ఇల్లును సొంతం చేసుకుని దంపతులిద్దరూ అక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఆ ఇంటి ఖరీదు సుమారు రూ.150 కోట్లు ఉంటుందని సమాచారం.
ముంబైలో ప్రియాంక నివసించిన ఇంటిని బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఏడు కోట్లు పెట్టి తన వశం చేసుకుంది. సముద్రం కనిపించే వ్యూతో బాల్కనీ, ఐదు బెడ్‌రూమ్‌లు, విశాలమైన లివింగ్ ఏరియా ఈ ఇంటి స్పెషాలిటీ!