
అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ప్రేమించొద్దు'. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ని జూన్ 7న విడుదల కానుంది.
వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ తెలిపాడు. ట్రైలర్ చూస్తుంటే చాలా ఆసక్తిగానే ఉంది. బస్తీ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రంగా ఉంది. నేటి తరం తల్లిదండ్రులు, పిల్లలు చూసేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. పాఠశాల నుంచి కాలేజీ స్థాయిలో ఉండే లవ్ స్టోరీలు.. వాటి వల్ల చదువుల్ని నిర్లక్ష్యం చేయడంతో వచ్చే నష్టాలు, తెలియని వయసులో ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలను కళ్ళకు కట్టినట్లు 'ప్రేమించొద్దు' చిత్రం ట్రైలర్‌లో చూపించారు. జూన్ 7న విడుదలయ్యే చిత్రాన్ని చూస్తే అసలు కథేంటో తెలుస్తుంది.