ముదిరిన ఫ్యాన్స్‌ వార్‌.. మరీ ఇంతకు తెగిస్తారా? | Fight Between Prabhas And Allu Arjun Fan Goes Violent, Video Trending On Social Media - Sakshi
Sakshi News home page

Allu Arjun Prabhas Fans Fight: ప్రభాస్‌ అభిమానిని అతి దారుణంగా చితకబాదిన బన్నీ ఫ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Published Sun, Mar 10 2024 9:55 PM

Prabhas, Allu Arjun Fan Wars Goes Violent - Sakshi

అభిమానం ఉండాలి.. కానీ పిచ్చి ఉండకూడదు. స్టార్‌ హీరోలకు అభిమానులం అని చెప్పుకుని తిరిగే కొందరు యువకులు సదరు కథానాయకులకే తలవంపులు తెచ్చేలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. అవతలి హీరో అభిమానులతో ఎప్పుడూ పోట్లాటకు దిగడమే కాకుండా కొట్టుకునే స్థాయికి దిగజారిపోయారు. తాజాగా ఇలాంటి అమానుష ఘటన బెంగళూరులో జరిగినట్లు తెలుస్తోంది.

కొందరు యువకులు ఓ వ్యక్తిని చొక్కా పట్టుకుని లాగుతూ రక్తం వచ్చేలా చితకబాదారు. జై అల్లు అర్జున్‌ అను.. అంటూ అక్కడున్న వాళ్లంతా అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. ఇంత పిచ్చోళ్లలా ఉన్నారేంటి? మీ హీరోల సినిమాలు చూసి ఆనందించాలే.. కానీ పక్క హీరో ఫ్యాన్స్‌తో ఫైటింగ్స్‌ ఏంటి? అని మండిపడుతున్నారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలంటూ బెంగళూరు పోలీసులను ట్యాగ్‌ చేస్తున్నారు.

చదవండి: డబ్బు కోసమే పెళ్లి? నాకోసం ఎంతమంది లైన్‌లో నిలబడ్డారో తెలుసా..!

 
Advertisement
 
Advertisement