
సీమ టపాకాయ్, అవును చిత్రాలతో హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది పూర్ణ (Poorna). మొదట్లో కథానాయికగా నటించినా తర్వాత సహాయ నటిగా మారింది. అఖండ, దృశ్యం 2, దసరా, భీమా.. ఇలా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా యాక్ట్ చేసింది. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాటలో నటించింది. ఇదిలా ఉంటే పూర్ణ.. 2022లో వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది. ఆ మరుసటి ఏడాదే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
రాత్రిళ్లు నీ జ్ఞాపకాలే..
తల్లయ్యాక కూడా ఏదో ఒక షోలు, ఈవెంట్స్ అంటూ బిజీగానే గడిపేస్తోంది. అయితే భార్య కోసం తాను కన్నీళ్లు పెట్టుకున్నానంటూ పూర్ణ భర్త చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. 'ఈ 45 రోజులు నా జీవితంలోనే మర్చిపోలేను. ఒంటరితనపు నిశ్శబ్ధాన్ని భరించలేకపోయాను. రాత్రిళ్లు నీ జ్ఞాపకాలతోనే గడిపేశాను. ప్రతిరోజు ఉదయం నిన్ను తల్చుకుని ఏడ్చేవాడిని.

నా భార్య తిరిగొచ్చింది
ఈ 45 రోజుల్లో నాకు ప్రేమ గొప్పదనం తెలిసొచ్చింది. మనల్ని ప్రేమించేవారు మనతో ఉండటమే జీవితంలో అన్నిటికంటే గొప్పనైన వరం. ఈరోజు నా భార్య నా దగ్గరకు తిరిగొచ్చేసింది. ఎన్నో ఎదురుచూపుల తర్వాత జరిగిన ఈ రీయూనియన్ వల్ల ఆనందభాష్పాలు వస్తున్నాయి అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన చాలామంది ఈ దంపతుల మధ్య ఏం జరిగింది? వీరిద్దరూ కలిసి లేరా? అన్న అనుమానాలు వ్యక్తం చేశారు.
క్లారిటీ ఇచ్చిన పూర్ణ భర్త
దీనికి పూర్ణ భర్త స్పందిస్తూ.. నా భార్య 20 రోజులు చెన్నైలో, 15 రోజులు మలప్పురంలో, ఆ తర్వాత జైలర్ 2 మూవీ కోసం అక్కడ తనింట్లో ఉంది. అంటే మొత్తం 45 రోజులు నాకు దూరంగా ఉంది. మాకు పెళ్లయి మూడేళ్లవుతున్నా.. ఇన్నిరోజులు దూరంగా ఎప్పుడూ లేము. అందుకే, అలా పోస్ట్ పెట్టాను. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకుండి. దేవుడి దయ వల్ల మేమంతా సంతోషంగా ఉన్నాం అని వివరణ ఇచ్చాడు. ఇందుకు తన ఫ్యామిలీ ఫోటోలు జత చేశాడు.
చదవండి: భర్తతో వినాయక చవితి సెలబ్రేషన్స్.. లావణ్య బేబీ బంప్ ఫోటో