
మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది. మేలో ప్రెగ్నెన్సీ ప్రకటించిన ఆమె తర్వాత కూడా సినిమాలు చేస్తూనే ఉంది. నేడు (ఆగస్టు 27) వినాయక చవితి సందర్భంగా ఓ స్పెషల్ ఫోటో షేర్ చేసింది. అందులో భర్త వరుణ్ తేజ్‌తో కలిసి గణపయ్య ముందు కూర్చుంది. వరుణ్ నేలపై కూర్చోగా.. లావణ్య ప్రెగ్నెంట్ కావడంతో కుర్చీపై కూర్చుని దేవుడికి రెండుచేతులతో నమస్కరిస్తోంది. అదే సమయంలో కెమెరావైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తోంది. ఇందులో లావణ్య బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది.
సినిమా
వరుణ్ తేజ్, లావణ్య 'మిస్టర్' సినిమాలో తొలిసారి జంటగా నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరి లవ్‌ను పెద్దలు అర్థం చేసుకుని పెళ్లికి పచ్చజెండా ఊపారు. అలా 2023లో వరుణ్- లావణ్యల పెళ్లి జరిగింది. ఇటలీలో వివాహం, హైదరాబాద్‌లో రిసెప్షన్ జరిగాయి. కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న లావణ్య.. ఓటీటీలో పులిమేక, మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్‌లు చేసింది. ప్రెగ్నెన్సీ మొదటి త్రైమాసికంలో ఆమె సతీ లీలావతి సినిమాలో నటించింది. అదింకా విడుదల కావాల్సి ఉంది.
చదవండి: టాప్ 15లో తనే చెత్త కంటెస్టెంట్.. దమ్మున్న శ్రీజకు సూపర్ పవర్