‘హరిహర వీరమల్లు’ వచ్చేస్తున్నాడు | Pawan Kalyan Hari Hara Veera Mallu Release Date Out | Sakshi
Sakshi News home page

‘హరిహర వీరమల్లు’ వచ్చేస్తున్నాడు

May 16 2025 1:36 PM | Updated on May 16 2025 1:45 PM

Pawan Kalyan Hari Hara Veera Mallu Release Date Out

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్‌ కావాల్సింది. కానీ పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలతో బీజీ కావడం వల్ల షూటింగ్‌ అనుకున్న సమయంలో పూర్తి కాలేదు. దీంతో విడుదలను వాయిదా వేస్తూ వచ్చారు మేకర్స్‌. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకోవడంతో రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. 

జూన్‌ 12నీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్‌ అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాకు తొలుత  క్రిష్ దర్శకత్వం వహించారు. షూటింగ్‌ ఆలస్యం కావడంతో ఆయన ఆ బాధ్యల నుంచి తప్పుకున్నాడు. దీంతో  ఎ.ఎం. జ్యోతి కృష్ణ రంగంలోకి దిగి మిగిలిన భాగాన్ని తెరకెక్కించారు. 

ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'మాట వినాలి', 'కొల్లగొట్టినాదిరో' గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్‌ 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement