
కళాశాల జీవితం చాలా ముఖ్యమైందని, సంతోషకరమైందని పేర్కొన్నారు. ఈ దశలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. మంచి స్నేహం చేస్తే జీవితం బాగుంటుందన్నారు. అదే చెడు సావాసం అయితే వేరే విధంగా ఉంటుందన్నారు. చదువు ముగించిన తరువాత మంచి విలువలతో కూడిన జీవితాన్ని సాగించాలన్నారు. అప్పు
తల్లిదండ్రుల కోసం ప్రతి రోజూ 10 నిమిషాలు కేటాయించండని అంటున్నారు నయనతార. కనెక్ట్ చిత్రం తరువాత ఈ అమ్మడు నటించిన చిత్రాలేవీ తెరపైకి రాలేదు. షారుక్ ఖాన్‌తో జతకట్టిన జవాన్ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇకపోతే తమిళంలో జయం రవికి జంటగా నటిస్తున్న ఇరైవన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. మరో రెండు కొత్త చిత్రాలను అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల ఒక ప్రైవేట్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నయనతార విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కళాశాల జీవితం చాలా ముఖ్యమైందని, సంతోషకరమైందని పేర్కొన్నారు. ఈ దశలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. మంచి స్నేహం చేస్తే జీవితం బాగుంటుందన్నారు. అదే చెడు సావాసం అయితే వేరే విధంగా ఉంటుందన్నారు. చదువు ముగించిన తరువాత మంచి విలువలతో కూడిన జీవితాన్ని సాగించాలన్నారు. అప్పుడే మీ జీవితం అందంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇకపోతే తల్లిదండ్రులకు ప్రాముఖ్యతనివ్వాలన్నారు. వారితో నిత్యం కనీసం 10 నిమిషాలు గడిపితే వారు ఆనందిస్తారని, మీకూ వారి ఆశీస్సులు లభిస్తాయని నయనతార పేర్కొన్నారు.
చదవండి: సినిమా సూపర్ హిట్.. హీరోకు నిర్మాత గోల్డ్ గిఫ్ట్
అమిగోస్ దాదాపు రెండున్నర గంటలు నేనే కనిపిస్తా: కల్యాణ్ రామ్