Nagarjuna: నాగార్జున వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

King Nagarjuna Paisley Silk Shirt Cost Will Leave You In Shock: కింగ్ నాగార్జున వరుసగా మూడోసారి బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తనదైన యాంకరింగ్‌తో 60 ఏళ్ల వయసులోనూ యంగ్‌లుక్స్‌తో,యమ స్టైలిష్‌గా కనిపించి నాగార్జున సత్తా చాటుతున్నాడు. ఇక వీకెండ్ ఎపిసోడ్స్‌లో నాగార్జున కాస్ట్యూమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనికోసం నాగ్ స్పెషల్ కేర్ తీసుకుంటారని సమాచారం. తాజాగా నాగార్జున ధరించిన ఓ షర్ట్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
చదవండి: కొత్త ఇంట్లోకి బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ గృహప్రవేశం
వీకెండ్ ఎపిసోడ్‌లో నాగ్ ఎట్రో పైస్లీ సిల్క్ షర్ట్ (Etro Paisley Silk Shirt)లో కనిపించారు. లెమన్ ఎల్లో కలర్‌లో కనిపించిన ఈ షర్ట్ కాస్ట్ ఎంతుంటుందబ్బా అని నెటిజన్లు సెర్చ్ చేయగా దిమ్మతిరిగే ధర కళ్ల ముందు కనిపించింది. ఈ షర్ట్ కాస్ట్ దాదాపు $1310 డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 83,908 రూపాయలు అన్నమాట.
దీంతో ఒక్క షర్ట్ కోసం నాగ్ ఇన్ని డబ్బులు వెచ్చించారా అని కొందరు షాక్ అవుతుండగా, టాలీవుడ్ మన్మథుడుఅంటూ ఆ మాత్రం ఉండాల్సిందే కదా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నాగార్జున ‘ది ఘోస్ట్’, ‘బంగార్రాజు’సినిమాలు చేస్తున్నారు.
చదవండి: నిన్ను నమ్మినవాళ్లను మోసం చేయొద్దు : వెంకటేశ్
దానికోసం అవసరమైతే గుండు కొట్టించుకుంటా : అనసూయ