
జాన్వీ కపూర్.. ఈ పేరు చెప్పగానే హీరోయిన్ అని అంటారు. కానీ ఆమె సినిమాలు చెప్పమంటే మాత్రం కచ్చితంగా తడబడతారు. ఎందుకంటే ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు ఏడేళ్లు కావొస్తున్నా సరే చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. గతేడాది రిలీజైన 'దేవర'.. ఈమెకు సక్సెస్‌తో పాటు దక్షిణాదిలో గుర్తింపు ఇచ్చింది. కానీ ఈమె దాన్ని సరిగా వినియోగించుకోలేకపోతోందా అనే సందేహం వస్తోంది. తాజాగా రిలీజైన కొత్త సినిమానే దీనికి ఉదాహరణలా కనిపిస్తోంది.
జాన్వీ కపూర్ లేటెస్ట్ హిందీ సినిమా 'పరమ్ సుందరి'. చెన్నై ఎక్స్‌ప్రెస్, టూ స్టేట్స్ తరహా సౌత్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన హిందీ చిత్రమిది. అయితే సినిమాలో కథ మరీ పాత చింతకాయ పచ్చడిలా ఉండటం, దానికి తోడు ఏ మాత్రం ఆసక్తి కలిగించని సీన్స్ ఉండటం లాంటి వాటివల్ల తొలిరోజు తొలి ఆటకే నెగిటివ్ టాక్ వచ్చింది. జాన్వీ యాక్టింగ్ బాగున్నప్పటికీ.. మలయాళ అమ్మాయిలా చెప్పిన డైలాగ్స్ ఏ మాత్రం ఆమెకు నప్పలేదని అంటున్నారు. లాంగ్ రన్‌లో ఈ మూవీ డిజాస్టర్ కావడం గ్యారంటీ అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: 'కూలీ' కల్యాణికి బంపరాఫర్.. లోకేశ్ పక్కన హీరోయిన్‌గా!)
'పరమ్ సుందరి' సినిమాతో జాన్వీకి మరో దెబ్బ పడిందని.. ఇకపై ఆశలన్నీ 'పెద్ది'పై పెట్టుకోవాల్సిందేనని నెటిజన్లు అంటున్నారు. 'దేవర' తర్వాత జాన్వీ చేస్తున్న మరో మూవీ 'పెద్ది'. రామ్ చరణ్ హీరో కాగా బుచ్చిబాబు దర్శకుడు. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలో రిలీజ్ ఉంది. ఇది పాన్ ఇండియా మూవీ. ఒకవేళ 'పెద్ది' హిట్ అయితే ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్-అట్లీ మూవీలోనూ జాన్వీ ఉందనే టాక్ నడుస్తోంది.
శ్రీదేవి వారసురాలిగా 2018లో 'దఢక్' మూవీతో జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మరాఠీ మూవీ 'సైరాత్'కి రీమేక్. దీంతో తొలి చిత్రంతో పర్లేదనిపించింది. సక్సెస్ అందుకుంది. తర్వాత ఓటీటీలో వచ్చిన 'గుంజన్ సక్సేనా' మూవీతో జాన్వీ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఎన్ని చిత్రాలు చేస్తున్నా సరే సక్సెస్ ఈమె దరిచేరడం లేదు. 'దేవర'తో హిట్ కొట్టింది. 'పెద్ది'తో ఏం చేస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: హీరోయిన్‌కి సూపర్ పవర్స్ ఉంటే.. 'కొత్త లోక' రివ్యూ)