
దర్శకులు అనగానే చాలావరకు తెర వెనకే ఉంటారు. అప్పుడప్పుడు లేదంటే కెరీర్‌లో ఓ దశ దాటిన తర్వాత నటులుగు మారుతుంటారు. కానీ తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ కనగరాజ్ మాత్రం కెరీర్ పీక్‌లోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయం చాన్నాళ్ల క్రితమే బయటకొచ్చినప్పటికీ ఇప్పుడు మరో క్రేజీ అప్‌డేట్ వినిపిస్తుంది. ఇది తెలిసిన నెటిజన్లు షాకవుతున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?
(ఇదీ చదవండి: హీరోయిన్‌కి సూపర్ పవర్స్ ఉంటే.. 'కొత్త లోక' రివ్యూ)
'కూలీ' సినిమాతో రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. తర్వాత ఏ మూవీ చేస్తాడా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. లెక్క ప్రకారం 'ఖైదీ 2' చేయాలి. కానీ ఆమిర్ ఖాన్‌తో ఓ సూపర్ హీరో మూవీ చేస్తాడనే రూమర్ వినిపిస్తుంది. ఈ విషయాలపై క్లారిటీ రావాలి. మరోవైపు తమిళ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తీయబోయే కొత్త చిత్రంతో లోకేశ్ కనగరాజ్ హీరోగా మారబోతున్నాడు. ఇప్పటికే లోకేశ్.. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.
ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా రచిత రామ్‌ని ఎంపిక చేశారని సమాచారం. ఈ మధ్య లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'కూలీ'లో ఈమె.. కల్యాణి అనే పాత్ర చేసింది. మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కన్నడలో స్టార్ హీరోయిన్ అయిన రచిత.. 'కూలీ'తో దక్షిణాదిలో ఫేమ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు లోకేశ్ సరసన హీరోయిన్‌గా ఈమెనే తీసుకున్నారట. ఇది కన్ఫర్మ్ అయిపోయిందని, త్వరలో ప్రకటన రానుందని టాక్. కొన్నాళ్ల క్రితం ఓ ఆల్బమ్ సాంగ్‌లో లోకేశ్ కనగరాజ్, శ్రుతి హాసన్‌తో కలిసి నటించాడు. ఇప్పుడు తన దర్శకత్వంలో యాక్ట్ చేసిన రచితతో నటించబోతున్నాడనమాట.
(ఇదీ చదవండి: పాడె మోసిన అల్లు అర్జున్, రామ్‌చరణ్.. వీడియో)