కరోనా పరిస్థితులపై సూపర్‌స్టార్‌ మహేశ్‌ ఆందోళన

If Necessary Step Out: Super Star Mahesh Babu Tweet To People - Sakshi

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సినీ ప్రముఖులు ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. విజయ్‌ దేవరకొండ తెలంగాణ పోలీసులతో కలిసి ఓ వీడియో రూపొందించగా.. తాజాగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ప్రజలకు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ‘తప్పనిసరైతేనే బయటకు రండి. అనవసరంగా బయటకు రావొద్దు. జాగ్రత్తలు తప్పక పాటించండి’ అంటూ ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు, సూచనలు ప్రజలతో పాటు తన అభిమానులకు చెప్పాడు.

‘రోజురోజుకు కరోనా తీవ్రమవుతోంది. బయటకు వచ్చినప్పుడల్లా మాస్క్‌ ధరించండి. మర్చిపోవద్దు. అవసరమైతేనే బయటకు అడుగు పెట్టండి. ఒకవేళ కరోనా వైరస్‌ వస్తే ఏ లక్షణాలతో బాధపడుతున్నారో తెలుసుకోండి. వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆస్పత్రికి వెళ్లండి. దీనిద్వారా అవసరమైన వారికి బెడ్లు అందుతాయి. ఈ క్లిష్ట పరిస్థితులు నుంచి మరింత దృఢంగా తయారవుతామని నేను నమ్ముతున్నా. ప్రతిఒక్కరూ సురక్షితంగా ఉండండి’ అని ట్వీట్‌ చేశారు.

చదవండి: కరోనా రోగి ప్రాణం నిలిపిన వలంటీర్లు: సీఎం ప్రశంస
చదవండి: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top