Director Ram Gopal Varma Comments On Avatar 2 Movie - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: అవతార్‌-2ను సినిమా అంటే కచ్చితంగా నేరమే.. ఆర్జీవీ ట్వీట్ వైరల్

Dec 16 2022 3:20 PM | Updated on Dec 16 2022 4:21 PM

Director Ram Gopal Varma Comments On Avatar 2 Movie  - Sakshi

అవతార్-2: ది వే ఆఫ్ వాటర్' ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట. ఎందుకంటే విజువల్‌ వండర్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన జేమ్స్ కామెరూన్ మరోసారి అవతార్‌-2 రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చారు. యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘అవతార్‌-2’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్’ విజువల్‌ వండర్‌గా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన విషయం తెలిసిందే.  తాజాగా అవతార్‌-2 సినిమాపై సంచలన దర్శకుడు ట్వీట్ చేశారు. అవతార్‌ సినిమాను చూశాక ఆర్జీవీ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

ఆర్జీవీ తన ట్వీట్‌లో రాస్తూ..'ఇప్పుడే అవతార్‌-2 లో స్నానం చేశా. దీన‍్ని సినిమా అని పిలిస్తే అది కచ్చితంగా నేరమే అవుతుంది. ఎందుకంటే ఆ విజువల్స్, యాక్షన్స్ జీవితకాలం గుర్తుండిపోతాయి. కొద్దిసేపటి క్రితమే ఆ సినిమా చూసి కొన్నిసార్లు థీమ్ పార్క్‌కు వెళ్లినట్లు ఫీలయ్యా. అది నాకు చెడుగా మాత్రం అనిపించలేదు.' అంటూ పోస్ట్ చేశారు. ఆర్జీవీ ట్వీట్‌ చూసిన అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.  మీ సినిమా డేంజరస్‌ కంటే బాగుందని కామెంట్స్‌ చేశారు. మరొకరు అవతార్‌-2 పై ఆర్జీవీ రివ్యూ అంటూ రిప్లై ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement