
ఆరు రోజుల పాటు ఆయన హైదరాబాద్‌లోనే ఉండబోతున్నట్లు సమాచారం.
‘‘ఓ కొత్త సినిమా ముహూర్తంలో పాల్గొనేందుకు చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చింది’’ అని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ శుక్రవారం ట్వీట్ చేశారు. ఇంతకీ అమితాబ్ ప్రయాణం ఎక్కడికీ అంటే.. హైదరాబాద్‌కి అని తెలిసింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించనున్న సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొనడానికే అమితాబ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. ఆరు రోజుల పాటు ఆయన ఈ షూట్‌లో పాల్గొంటారట.
నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఎక్కడా తగ్గకుండా నిర్మాత సి.అశ్వినిదత్ 500కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మూవీని నిర్మించనున్నారట.
T 3975 - .. travelled .. and the mahurat of first day tomorrow .. a new film a new beginning , a new environ ..
— Amitabh Bachchan (@SrBachchan) July 23, 2021
'NEW' never fades .. it grows exponentially