'అల్లు అర్జున్‌' అందుకున్న అత్యుత్తమ అవార్డ్స్‌ ఇవే | Allu Arjun Still His All Movies Got Great Awards | Sakshi
Sakshi News home page

'అల్లు అర్జున్‌' అందుకున్న అత్యుత్తమ అవార్డ్స్‌ ఇవే

Jun 17 2025 9:47 AM | Updated on Jun 17 2025 10:04 AM

Allu Arjun Still His All Movies Got Great Awards

పుష్ప–2 సినిమాతో 'అల్లు అర్జున్‌' ఉత్తమ నటుడిగా 'గద్దర్‌' అవార్డు అందుకున్నారు. గద్దర్‌ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణ చరిత్రలో బన్నీ పేరు చిరస్థాయిలో ఉండిపోనుంది. ఉత్తమ నటుడిగా గద్దర్‌ తొలి అవార్డ్‌ అందుకుని చరిత్ర పుటల్లోకి అల్లు అర్జున్‌ పేరు చేరింది. అదే విధంగా 69వ జాతీయ అవార్డుల్లో కూడా తెలుగు సినిమా సత్తా చాటింది. అక్కడ కూడా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప) నిలవడం సరికొత్త ఘనత అని చెప్పొచ్చు. ఎందుకంటే 69 ఏళ్ల సినీ చరిత్రలో ఓ తెలుగు నటుడికి జాతీయ అవార్డ్ రావడం ఇదే ఫస్ట్ టైమ్.

'ఆ బిడ్డ మీద ఒక్క చిన్న గీత పడాలా... గంగమ్మ తల్లి జాతరలో యాటను నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. ఒక్కొక్కడిని రప్పా రప్పా రప్పా...' అంటూ విలన్లకి వార్నింగ్‌ ఇస్తాడు పుష్పరాజ్‌. ఇదే డైలాగ్‌ రీసెంట్‌గా గద్దర్‌ అవార్డ్‌ అందుకుని మరోసారి చెప్పి తన అభిమానుల్లో జోష్‌ నింపారు. ప్రస్తుతం అల్లు అర్జున్- అట్లీ (AA22) చిత్రం కోసం పనిచేస్తున్నారు. బన్నీ ఇప్పటి వరకు నటించిన సినిమాలు 21.. అయితే, ఉత్తమ నటుడిగా   11సార్లు నామినేట్‌ అయ్యాడు. ఏడు చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా అత్యుత్తమ అవార్డ్స్‌ అందుకున్నాడు. మొత్తంగా దేశంలో పేరు పొందిన 18 అవార్డ్స్‌ను ఆయన సొంతం చేసుకున్నాడు.

ఫిలింఫేర్ అవార్డులు

  • పరుగు (2009)- ఉత్తమ నటుడు

  • వేదం (2011)- ఉత్తమ నటుడు

  • రేసు గుర్రం (2015)- ఉత్తమ నటుడు

  • రుద్రమదేవి (2016)- ఉత్తమ సహాయ నటుడు

  • సరైనోడు (2017)- క్రిటిక్స్‌ ఉత్తమ నటుడు

  • పుష్ప (2022)- ఉత్తమ నటుడు

గద్దర్‌ అవార్డ్‌
పుష్ప-2 (2024)- ఉత్తమ నటుడు

ఐఫా అవార్డ్స్‌
రుద్రమదేవి (2016)- ఉత్తమ సహాయ నటుడు

సైమా అవార్డ్స్‌

  • సన్నాఫ్ సత్యమూర్తి (2015)-  దక్షిణ భారత సినిమా స్టైలిష్ యూత్ ఐకాన్
  • రుద్రమదేవి (2016)-  ఉత్తమ నటుడు
  • అలా వైకుంఠపురంలో (2021)-  ఉత్తమ నటుడు
  • పుష్ప (2022)-  ఉత్తమ నటుడు
     

నంది అవార్డ్స్‌

  • గంగోత్రి (2003) 

  • ఆర్య (2004)

  • పరుగు(2008)

  • వేదం(2010)

  • రుద్రమదేవి (2015)

నేషనల్‌ అవార్డ్‌

పుష్ప(2022)- ఉత్తమ నటుడిగా 2023లో రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డ్‌ అందుకున్న అల్లు అర్జున్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement