Actress Khushbu Sundar Scenes Chopped in Vijay Varisu Movie - Sakshi
Sakshi News home page

Varisu Movie: షాక్‌లో తమిళ ప్రేక్షకులు.. ‘వారిసు నుంచి ఆమెను తొలగించారా?’

Jan 12 2023 6:42 PM | Updated on Jan 12 2023 7:06 PM

Actress Khushbu Sundar Scenes Chopped in Vijay Varisu Movie - Sakshi

తమిళ స్టార్‌ హీరో విజయ్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన లేటెస్ట్‌ మూవీ వారిసు(తెలుగులో వారసుడు). జనవరి 11న విడుదల కావాల్సిన ఈ మూవీలో తెలుగులో వాయిదా పడిన సంగతి తెలిసిందే. థియేటర్ల ఇష్యూ కారణంగా ఇక్కడ వాయిదా పడగా.. తమిళంలో మాత్రం అదే తేదీకి విడుదలైంది. బుధవారం ఈ చిత్రం తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి షో నుంచి వారిసు మంచి హిట్‌టాక్‌ను సొంతంగా చేసుకుంది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న ఈ మూవీ విజయ్‌ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంది.

చదవండి: బాలకృష్ణ వీర సింహారెడ్డి ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదే? స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..!

అయితే ఈ సినిమాలో ఆడియన్స్‌కు ఓ ఊహించని ఎలిమెంట్‌ ఒకటి షాకించిందట. దీంతో ఈ విషయంలో ఆడియన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ముందుగా వచ్చిన అప్‌డేట్‌ ప్రకారం ప్రముఖ నటి ఖుష్భు సుందర్‌ కీ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు షూటింగ్‌ స్పాట్‌లో మూవీ టీంతో కలిసి దిగిన ఫొటోలను ఖుష్భు తన సోషల్‌ మీడియలో షేర్‌ చేసింది కూడా. సెట్‌లో విజయ్‌, రష్మిక, ఖష్బు స్టిల్స్‌ కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే సినిమాలో మాత్రం ఖుష్బు ఎక్కడ కనిపించలేదట. దీంతో సినిమాలో ఆమె పాత్ర ఎక్కడ కనిపించకపోవడం తమిళ ప్రేక్షకులు సర్‌ప్రైజ్‌ అయ్యారని కోలీవుడ్‌ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

చదవండి: రాహుల్‌కు కంగ్రాట్స్‌ చెప్పిన అషురెడ్డి, మరోసారి తెరపైకి ఎఫైర్‌ రూమర్స్‌

సినిమా చూసి బయటకు వచ్చాక ఖుష్బు సినిమాలో ఎక్కడ కనిపించలేదని, ఆమె సన్నివేశాలను ఎందుకు తొలగించారు? అంటూ సోషల్‌ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు మూవీ టీంని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఈ మూవీ నుంచి వైరల్‌ అయిన ఆమె స్టిల్స్‌, వారిసు టీంతో కలిసి ఆమె షేర్‌ చేసిన పలు పోస్ట్‌లను షేర్‌ చేస్తున్నారు. దీంతో ఖుష్బు సీన్లను ఎందుకు తొలగించారన్నది మాత్రం ప్రస్తుతం స​స్పెన్స్‌ నెలకొంది. వారిసు నుంచి ఆమెను తొలగించారా? ఎందుకు ఆమె సీన్లను తొలగించాల్సి వచ్చింది! అసలేం జరిగిందనేది ఆసక్తిని సంతరించుకుంది. అయితే వీటన్నింటికి సమాధానం రావాలంటే మూవీ టీం నుంచి క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాలి. 

Advertisement
 
Advertisement
Advertisement