
చాలా సినిమాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయంటోంది నటి దీక్షా పంత్ (Diksha Panth). ఇటీవల వచ్చిన ఓ పెద్ద మూవీలో కూడా తాను నటించాల్సిందని, కానీ చెప్పాపెట్టకుండా సైడ్ చేశారని వాపోయింది. ఇలా తన కెరీర్ జర్నీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది. దీక్షా పంత్ మాట్లాడుతూ.. మాది ఉత్తరాఖండ్. నాన్న రైల్వే ఉద్యోగి కావడంతో ఎప్పుడూ ట్రాన్స్‌ఫర్స్ అవుతుండేవి. అలా నేను పుట్టింది విజయవాడలో, పెరిగింది కాకినాడలో!
మొదట నో చెప్పా..
ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకున్నాను. ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఓ ఈవెంట్‌లో కొరియోగ్రాఫర్ నన్ను చూసి మోడలింగ్ ట్రై చేయొచ్చుగా అని చెప్పారు. మా ఇంట్లో చంపేస్తారంటూ నో చెప్పాను. రెండేళ్ల తర్వాత అతడే మళ్లీ కాల్ చేసి అడిగాడు. ఇంతలా అడుగుతున్నాడని ఒకసారి ట్రై చేద్దామని చేశాను. ఇంట్లో ఒప్పించి ఫోటోషూట్, ర్యాంప్ షోస్ చేశాను. అలా మోడలింగ్‌లో బిజీ అయ్యాను. తర్వాత సినిమాల్లోకి వచ్చాను.
పెద్ద మూవీలో ఆఫర్
మొదట్లో అవకాశాలిస్తాం కానీ మాకు మరేదో కావాలని అడిగేవారు. నేను ముఖం మీదే నో చెప్పేదాన్ని. నన్ను రిజెక్ట్ చేసేవారు. అవకాశాల కోసం మరీ అందరితో రాసుకుపూసుకు తిరగను. అందుకే సక్సెస్‌ఫుల్ కాలేదు. గతంలో మంచి హిట్స్ ఇచ్చిన ఒక పెద్ద డైరెక్టర్ ఈ మధ్య ఓ పీరియడ్ డ్రామా సినిమా రిలీజ్ చేశారు. 2017లోనే ఈ మూవీ చేయమని ఆఫర్ చేశారు.
అలా ఎన్నో ఆఫర్స్ మిస్
అంతా బానే ఉందనుకున్న సమయంలో సడన్‌గా నన్ను వద్దనుకున్నారు. ఆ విషయం నాకు చెప్పనేలేదు. అంత మంచి ప్రాజెక్ట్ వచ్చినట్లే వచ్చి చేజారడం కాస్త బాధేసింది. అలా చాలా ఆఫర్లు వచ్చినట్లే వచ్చి చేతికందకుండా పోయాయి అని చెప్పుకొచ్చింది. రచ్చ, వరుడు, ఒక లైలా కోసం, గోపాల గోపాల చిత్రాల్లో అలరించింది నటి దీక్షా పంత్. మంగమ్మ అనే ప్రైవేట్ సాంగ్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తెలుగు బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో పాల్గొని మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.
చదవండి: ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సారీ చెప్పు, లేదంటే మా తడాఖా చూపిస్తాం