ధాన్యం.. దైన్యం
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 29 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
శివ్వంపేట(నర్సాపూర్)/కౌడిపల్లి(నర్సాపూర్)/కొల్చారం(నర్సాపూర్)/చిలప్‌చెడ్(నర్సాపూర్)/చేగుంట(తూప్రాన్)/నర్సాపూర్ /నర్సాపూర్ రూరల్: జిల్లావ్యాప్తంగా రైతులు వరికోతలు ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్న నేపథ్యంలో అకాల వర్షాలు వారిపాలిట శాపంగా మారాయి. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కాస్తా భారీ వర్షాల కారణంగా తడిసి ముద్దయింది. చేతికందొచ్చిన పంట కాస్తా చేజారిపోయే పరిస్థితులేర్పడటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. శివ్వంపేట మండలం భీమ్లా తండా, కౌడిపల్లి మండలంలోని ధర్మాసాగర్, వెల్మకన్న, మహమ్మద్‌నగర్‌గేట్‌తండా, కూకుట్లపల్లి, చిలప్‌చెడ్ మండలంలో జగ్గంపేట, గంగారం, శీలాంపల్లి, బండపోతుగల్, అగజ్జమర్రి గ్రామాల్లో, చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో, నర్సాపూర్, మూసాపేట తదితర గ్రామాల్లో రైతులు తమ ధాన్యాన్ని ఆరోబెట్టగా సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలకు ధాన్యం కొన్ని చోట్ల తడిసిపోయింది. మరికొన్ని చోట్ల వర్షపునీటికి కొట్టుకుపోయింది. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
నర్సాపూర్ మండలంలో ఖాజీపేట, బ్రాహ్మణపల్లి, తుజాల్ పూర్, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాలలో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ఐజేపి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా తూకం మాత్రం వేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
ధాన్యం.. దైన్యం
ధాన్యం.. దైన్యం
ధాన్యం.. దైన్యం
ధాన్యం.. దైన్యం


