
ట్రేడ్ లైసెస్సుల ప్రక్రియ వేగవంతం
దుబ్బాక: మున్సిపాల్టీలో వాణిజ్య, వ్యాపార సముదాయాలకు జారీచేసే ట్రేడ్ లైసెన్స్‌ల ప్రక్రియను వేగవంతం చేయాలని సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ రుషికేష్ వాత్సవ్ ఆదేశించారు. మంగళవారం ఆయన మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రేడ్ లైసెన్స్‌ల జారీ ప్రక్రియ, భువన్ యాప్ ద్వారా ఇంటి పన్నులు చెల్లించే వివరాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణను కమిషనర్ రమేశ్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. అనంతర ఆయన మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్సుల దరఖాస్తులపై అవగాహన కల్పించాలన్నారు. భువన్‌యాప్‌లో భవనాలు, వాణిజ్య, వ్యాపారాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, అనిల్‌రెడ్డి, నర్సయ్య తదితరులు ఉన్నారు.
సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ రుషికేష్ శ్రీవాత్సవ్