
అంగన్‌వాడీలబలోపేతానికి చర్యలు
వెల్దుర్తి(తూప్రాన్): రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల బలోపేతానికి చర్యలు తీసుకుంటుందని ఐసీడీఎస్ పీడీ హైమావతి అన్నారు. బుధవారం మండలంలోని శేరీల గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. చిన్నారుల వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగిన బరువు ఉన్నారా..? అని పరిశీలించారు. అనంతరం శిథిలావస్థకు చేరిన అంగన్‌వాడీ భవనాన్ని పరిశీలించారు. మరమ్మతులు చేపట్టినా ఫలితం ఉండదని, భవనాన్ని పూర్తిగా తొలగించి నూతన భవనం నిర్మించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఆమె వెంట టీచర్ దేవలత, సిబ్బంది ఉన్నారు.
గ్రామాలు పరిశుభ్రంగాఉండాలి: డీపీఓ
కౌడిపల్లి(నర్సాపూర్): వర్షాకాలం గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని డీపీఓ యాదయ్య తెలిపారు. బుధవారం కౌడిపల్లి పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా డీపీఓ మాట్లాడుతూ.. ప్రతి గ్రామం సంపూర్ణ పారిశుద్ధ్యంగా ఉండేలా చూడాలన్నారు. మురికి నీరు, చెత్త లేకుండా చూడాలని, రక్షిత తాగునీటి పథకంలో పైపులైన్ లీకేజీలు ఉంటే సరిచేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, కారోబార్ ఎల్లం ఉన్నారు.
మోడల్ ఇందిరమ్మఇల్లు బాగుంది
కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రూ. 5 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం, పంచాయతీ రాజ్ డివిజన్ కార్యాలయ భవానాన్ని అదనపు కలెక్టర్ నగేష్ బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం బాగుందన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. గ్రంథాలయానికి సొంత భవనం కేటాయించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట తహసీల్దార్ ఆంజనేయులు, ఆర్‌ఐ శ్రీహరి, పీఆర్ ఏఈ మారుతి తదితరులు పాల్గొన్నారు.
పేదల సొంతింటి కల సాకారం
కొల్చారం/నర్సాపూర్ రూరల్: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం అని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. బుధవారం కొల్చారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి నూతన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఎలాంటి అపోహకు గురికావొద్దని సూచించారు. అలాగే నర్సాపూర్ మండలంలోని ఇబ్రహీంబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాజిరెడ్డి భూమి పూజ చేశారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో యాదగౌడ్, రామగౌడ్, నరేష్, బీమ్, రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రంగంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీలబలోపేతానికి చర్యలు

అంగన్‌వాడీలబలోపేతానికి చర్యలు