
సింగూరులోకి వరద
1,560 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
సింగూరు జలాశయం
పుల్‌కల్(అందోల్): మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో సింగూరు డ్యామ్‌లోకి వరద చేరుతోంది. బుధవారం 1,560 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరిందని ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతంలో కురిసిన వర్షపు నీరంతా మంజీరా నది ద్వారా, మునిపల్లి మండలం దుబ్బవాగు ద్వారా డ్యాంలోకి నీరు చేరుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 19.219 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు టీఎంసీల నీరు చేరిందని అదికారులు తెలిపారు. డ్యామ్ ఎగువ భాగం మహారాష్ట్రలోని లాతూర్‌లో కురుస్తున్న వర్షం డ్యామ్‌లోకి చేరుతుందని అధికారులు తెలిపారు.