
పట్టుదలకు ప్రోత్సాహం
బెల్లంపల్లి: తాండూర్ మండలం మాదారం టౌన్‌షిప్‌కు చెందిన ఎనగంటి శ్యామలకు దేశమన్నా.. దేశభక్తి అన్నా ఎనలేని అభిమానం. అణువణువునా మాతృదేశంపై మమకారం పెంచుకుంది. ఎనగంటి శ్యామల, సమ్మిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. సమ్మిరెడ్డి సింగరేణి కంపెనీలో కార్మికుడిగా పని చేసేవారు. పిల్లలు చిన్నతనంలో ఉండగానే 1988లో అకాల మరణం చెందారు. దీంతో కుటుంబ బాధ్యతలు శ్యామలపై పడ్డాయి. భర్త వారసత్వంగా వచ్చిన సింగరేణి ఉద్యో గం చేస్తూ ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేసింది. చిన్న కుమారుడు రాజశేఖర్ డిగ్రీ చదువుతూనే 2006లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సాధించాడు. తల్లి ఆశించినట్లుగానే దేశ రక్షణలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజశేఖర్ పెద్దనాన్న కుమారులు ఒకరు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, మరొకరు నేవీలో పని చేసేవారు. వారి స్ఫూర్తితో మూ డో ప్రయత్నంలో ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సాధించి తల్లి కలను సాకారం చేశాడు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో సార్జెంట్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. దేశ సేవ చేయాలనే పట్టుదల కుమారుడికి ఉండడంతో ప్రోత్సహించింది. రెండు సార్లు విఫలమైనా వెన్నుతట్టి అండగా నిలబడడంతో నేడు దేశ సేవలో ముందున్నాడు.