
● ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు ● విద్యార్థులకు మెళకువలపై ఉపాధ్యాయుల సూచనలు
భయాన్ని వదిలితే మెరుగైన ఫలితం...
గణితం అంటే కష్టమైన సబ్జెక్టు అనే భయాన్ని దూరం చేయాలి. అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు. సూత్రాలు, సమస్య సాధనలో సెప్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. కొన్ని ప్రశ్నలకు నిర్మాణ క్రమం రాయటం, గ్రాప్ గీయటంపై ప్రత్యేక సాధన చేయాలి. సమితులు సంఖ్యాశాస్త్రం, సంభావ్యత వంటి సులువైన చాప్టర్స్ నుంచి వచ్చే ప్రశ్నలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. సంఖ్యా వ్యవస్థ, బీజ గణితం, నిరూపక రేఖాగణితం, క్షేత్ర సితి, త్రికోణమితి అధ్యాయాలపై సంపూర్ణ అవగాహన అవసరం.
– కృష్ణ, గణితం, జెడ్పీఎస్‌ఎస్, వెల్గనూర్
పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 3నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది నుంచి ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నారు. సిలబస్ మాత్రం పూర్తిగా చదవాల్సి ఉండగా రాయాల్సిన పరీక్షల సంఖ్య తగ్గుతోంది. అయినా ప్రణాళిక ప్రకారం సన్నద్ధమైతే మెరుగైన ఫలితాలు సాధించడం కష్టమే కాదంటున్నారు నిపుణులు. మరోవైపు పరీక్ష సమయం సమీపిస్తుండడంతో విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. పరీక్షల్లో విద్యార్థులకు ఎదురయ్యే సందేహాల నివృత్తితో పాటు మెలకువలపై నిపుణుల సలహాలు, సూచనలు ఇలా ఉన్నాయి. – మంచిర్యాలఅర్బన్

