21 వేల బస్తాల ధాన్యం రాక
నవాబుపేట: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుకు ఆదివారం వరి, మొక్కజొన్న కలిసి దాదాపు 21 వేల బస్తాల ధాన్యం వచ్చింది. ఇందులో 15,973 బస్తాల వరిధాన్యం రాగా క్వింటాల్ గరిష్టంగా రూ.2,874, కనిష్టంగా రూ.1,879 ధర వచ్చింది. అలాగే 5,983 బస్తాల మొక్కజొన్న రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.1,894, కనిష్టంగా రూ.1,550 చొప్పున పలికింది. కాగా.. వరిధ్యానం వారం వారం పెరుగుతూ వస్తుందని, వచ్చేవారం మరింత పెద్ద మొత్తంలో వస్తుందన్న అంచనా మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కెట్ చైర్మన్ లింగం, కార్యదర్శి రమేష్ తెలిపారు.


