కాటేస్తున్న ఎయిడ్స్ భూతం
● ఉమ్మడి జిల్లాలో ఏటా పెరుగుతున్న కేసులు
● వ్యాధి నియంత్రణపై దృష్టిసారించని వైద్యారోగ్యశాఖ
● ఆందోళన కలిగిస్తున్న పాజిటివ్ కేసులు
● నేడు అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం
‘యువ’ క్లినిక్‌లు ఏవి?
హెచ్‌ఐవీపై అవగాహన కల్పించేందుకు గాను ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ఆస్పత్రుల్లో 19 ‘యువ క్లినిక్‌శ్రీలు ఏర్పాటు చేశారు. ఇందులో ఉండే వైద్యులు యువతకు లైంగికపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సుఖవ్యాధుల తీరు, అప్రమత్తతపై అవగహన కల్పించాల్సి ఉంటుంది. అయితే వీటిని అలా ఏర్పాటుచేసి.. ఇలా మూసేశారు. యువతను జాగృతంచేసి వారి ఆరోగ్యాన్ని పదిలపరిచే ప్రక్రియకు మంగళం పాడారు.
అవగాహన
కార్యక్రమాలు శూన్యం..
వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఐవీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం ప్రపంచ ఎయిడ్స్ దినాన మొక్కుబడి కార్యక్రమాలతో మమ అనిపిస్తున్నారు. దీంతో గ్రామీణా ప్రాంతాల్లో చాలా మంది చికిత్స చేయించుకునేందుకు ముందుకు రావడంలేదు. మరికొందరు ఆత్మగౌరవం దెబ్బతింటుందనే ఉద్దేశంతో చికిత్సకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో చైతన్యం తీసుకురావడానికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
నానాటికీ ఎయిడ్స్ (హెచ్‌ఐవీ) భూతం పంజా విసురుతోంది. క్షణకాలం సౌక్యం.. కోరి కష్టాలను తెస్తోంది. అవగాహనలేమి భవితను ఆగం చేస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా
నుంచి వందల సంఖ్యలో ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం.. అక్కడ ఇతర ప్రాంతాలకు చెందిన వారితో కలవడం.. జిల్లా పొడవునా జాతీయ రహదారులు ఉండటం హెచ్‌ఐవీ–ఎయిడ్స్ బాధితుల పెరుగుదలకు కారణాలుగా నిలుస్తున్నాయి.
కొందరు తెలిసీ తెలియక చేసిన తప్పుతో అందమైన
జీవితంతో పాటు భార్యాపిల్లల జీవితాలను సైతం అంధకారంలోకి నెడుతున్నారు. నేడు (సోమవారం) అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక
కథనం..! – మహబూబ్‌నగర్ క్రైం
జిల్లా రిజిస్ట్రేషన్ చికిత్స మరణాలు
చేసుకున్నవారు పొందుతున్నవారు
మహబూబ్‌నగర్ 8,016 3,125 2,414
నాగర్‌కర్నూల్ 5,379 2,340 1,446
నారాయణపేట 4,557 1,822 1,418
జోగుళాంబ గద్వాల 2,720 1,320 746
వనపర్తి 3,767 1,751 1,141
ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లోనే హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారు. ఆ తర్వాత నారాయణపేట నియోజకవర్గంలో ఓ మోస్తరుగా ఉండగా.. గద్వాల నియోజకవర్గంలో వెయ్యి మందికి పైగా ఉన్నారు. ఆయా నియోజకవర్గాలను అనుసరించి జాతీయ రహదారులు ఉండటం.. ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం.. నిరక్షరాస్యత వంటి కారణాలతో వ్యాధిబారిన పడుతున్నారు. ఆ తర్వాత తమ సతీమణులకు సైతం అంటిస్తున్నారు. మరోవైపు జిల్లా పొడవునా దాదాపు 185 కి.మీ. మేర ఉన్న జాతీయ రహదారికి సమీప గ్రామాల్లో సైతం ఈ వ్యాధి బాధితులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి..


