కాకర్‌జాల్ కా ‘రాజా’
నవాబుపేట: కాకర్‌జాల్ రాజు అంటేనే ఏకగ్రీవాలకు స్పెషల్. అలాంటి నేత తాజాగా 44 ఏళ్ల అనంతరం సర్పంచ్‌గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని కాకర్‌జాల్ గ్రామంలో 1154 మంది జనాభా ఉండగా, 459 మంది ఓటర్లు ఉన్నారు. కాగా ఈ గ్రామం వరుసగా ఏకగ్రీవాల్లో రెండోసారి నమోదైంది. గతంలో 2019 సంవత్సరంలో ఈ గ్రామం ఎస్‌సీ మహిళకు రిజర్వు కాగా మంగమ్మ అనే మహిళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాజాగా జనరల్‌కు కేటాయించటంతో ఇక్కడ మాజీ సర్పంచ్‌ను తాజాగా ఏకగ్రీవం చేశారు. తాజాగా సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై న వ్యక్తికి 44 సంవత్సరాల అనంతరం రెండోసారి సర్పంచ్ పదవి దక్కింది. ఆయన గతంలో 1981లో కాకర్‌జాల్ ఉమ్మడి పంచాయతీగా ఉన్నప్పుడు సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. అనంతరం 1995, 2001లో గ్రామ ఉపసర్పంచ్‌గా రెండుసార్లు ఏకగ్రీంగా ఎన్నికయ్యాడు. తాజాగా మరోసారి సర్పంచ్‌గా ఏకగ్రీవం కావటం ప్రత్యేకం.
35 ఏళ్లుగా ఉపసర్పంచ్
అమరచింత: అమరచింత మండలంలోని ఈర్లదిన్నె గ్రామ ఉప సర్పంచ్‌గా గ్రామానికి చెందిన మోరెడ్డి ఊసిరెడ్డి 35 సంవత్సరాలుగా ఉప సర్పంచ్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించడం విశేషం. సర్పంచ్‌గా చుక్క వంశానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు 35 ఏళ్లు పరిపాలనలో ఉండగా, అదే తరహాలో మోరెడ్డి వంశానికి చెందిన ఊసిరెడ్డి సైతం 35 ఏళ్లుగా ఉప సర్పంచ్‌గా కొనసాగారు. దీంతో 35 ఏళ్లుగా గ్రామంలోని చుక్క, మోరెడ్డి వంశీయులే గ్రామ పరిపాలన కొనసాగిస్తూ వచ్చారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో వయోభారంతో తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.
44 ఏళ్ల తరువాత మరోసారి సర్పంచ్
కాకర్‌జాల్ కా ‘రాజా’
కాకర్‌జాల్ కా ‘రాజా’


