
కూరగాయల సాగుతో అధిక లాభాలు
కొత్తకోట రూరల్: రైతులు సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి కూరగాయల సాగు చేయడం ద్వారా రోజు ఆదాయాన్ని పొందవచ్చని ఉద్యాన విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త డా.శ్రీనివాస్, ఏఓ సైదులు అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి రైతువేదికలో కూరగాయల సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, జీడిమెట్ల ఆధ్వర్యంలో రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూరగాయల సాగులో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో కోరమాండల్ ఏటీఎం శివకుమార్, సీనియర్ మేనేజర్ మంజునాథ్, జీడిమెట్ల హార్టికల్చర్ అధికారి జలంధర్, ఉద్యాన అధికారి శ్రీకాంత్, వ్యవసాయ విస్తరణ అధికారి మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు.