జూరాలకు మళ్లీ పెరిగిన వరద | - | Sakshi
Sakshi News home page

జూరాలకు మళ్లీ పెరిగిన వరద

Jul 5 2025 5:58 AM | Updated on Jul 5 2025 5:58 AM

జూరాలకు మళ్లీ పెరిగిన వరద

జూరాలకు మళ్లీ పెరిగిన వరద

ధరూరు/ఆత్మకూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువన కురిసిన వర్షాలతో ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గురువారం ప్రాజెక్టుకు 80వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శుక్రవారం ఉదయం నుంచి క్రమంగా పెరుగూ వచ్చింది. సాయంత్రానికి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో లక్షా 15వేల క్యూసెక్కులకు పెరిగినట్లు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 14 క్రస్టు గేట్లను ఎత్తి 95వేల 566 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 29,494 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌–1కు 650 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 44 క్యూసెక్కులు, ఎడమ కాల్వవకు 550 క్యూసెక్కులు, కుడి కాల్వకు 280 క్యూసెక్కులు, ఆర్‌డీఎస్‌ లింక్‌ కెనాల్‌కు 150 క్యూసెక్కులు, సమాంతర కాల్వవకు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌–2కు 750 క్యూసెక్కులు ప్రా జెక్టు నుంచి మొత్తం లక్షా 27,659 క్యూసెక్కుల నీటి ని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నా రు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.991 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు.

కొనసాగుతున్న విద్యుదుత్పత్తి

దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో 11 యూనిట్లద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు.

శ్రీశైలానికి భారీగా నీటి ప్రవాహం

దోమలపెంట: జూరాల నుంచి 1,24,610 క్యూసెక్కుల నీటిని దిగువున ఉన్న శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. శుక్రవారం నాటికి శ్రీశైలం జలాశయంలో 876.3 అడుగుల నీటిమట్టం వద్ద 169.8650 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో భూగర్భ కేంద్రంలో 17.498 మిలియన్‌ యూనిట్లు విద్యుదుత్పత్తి చేసి 34,926 క్యూసెక్కులు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంతో 14.428 మి.యూనిట్ల విద్యుతుత్పత్తి అనంతరం 26,140 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్‌ జలాశయానికి విడుదల చేశారు. రేగుమాన్‌గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 292 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

రామన్‌పాడుకు 1200 క్యూసెక్కుల వరద

మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయానికి శుక్రవారం 1200 క్యూసెక్కుల వరద చేరిందని ఏఈ వరప్రసాద్‌ తెలిపారు. జలాశయంలో సముద్ర మట్టానికి పైన 1,018 అడుగులు ఉండగా.. జూరాల ఎడమ, కుడి కాల్వల్లో 550 క్యూసెక్కులు, సమాంతర కాల్వలో 670 క్యూసెక్కుల వరద కొనసాగుతుందన్నారు. అలాగే రామన్‌పాడు జలాశయం నుంచి ఎన్టీఆర్‌ కాల్వకు 564 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 45 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు.

1.15లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..

14 గేట్లు ఎత్తి 1.27లక్షల క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement