
వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకే..
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు సిబ్బందికి వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పోలీస్ డ్యూటీ మీట్‌ను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ తెలిపారు. జిల్లా కేంద్రంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ పోలీస్ డ్యూటీ మీట్ ద్వారా వృత్తిపరమైన అంశాల్లో శిక్షణ పొంది పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని స్టేట్ లెవల్‌కు, అక్కడ విజేతలుగా నిలిస్తే జాతీయ స్థాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్‌కు పంపుతామని పేర్కొన్నారు. దేశస్థాయిలో జరిగే కార్యక్రమంలో విజేతలు నిలిస్తే వారికి పోలీసుశాఖ నుంచి ఇంక్రిమెంట్లు, క్యాష్ రివార్డులు ప్రకటిస్తామని తెలిపారు.
5 జిల్లాల నుంచి..
రెండురోజుల పాటు నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో నిర్వహించిన పోలీసు డ్యూటీ మీట్‌లో జోగుళాంబ గద్వాల జోన్‌లోని 5 జిల్లాలకు సంబంధించిన పోలీసులు పాల్గొనగా.. 24 అంశాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన 72 మందికి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌ను అందజేశారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో పకడ్బందీగా జోనల్ పోలీస్ డ్యూటీ మీట్‌ను నిర్వహించి, స్వతంత్ర జడ్జిలతో విజేతలు ప్రకటించడం అభినందనీయమని డీఐజీ చౌహాన్ అన్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి, నారాయణపేట ఎస్పీ యోగేష్‌గౌతమ్, వనపర్తి ఎస్పీ గిరిధర్, అదనపు ఎస్పీలు రామేశ్వర్, ఏఆర్‌ఏ ఎస్పీలు రియాజ్ ఉల్‌హక్, సురేష్‌కుమార్ పాల్గొన్నారు.
పోలీస్ డ్యూటీ మీట్
72 మంది విజేతలకు మెడల్స్ అందజేత
డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్