
ప్రాజెక్టుల భద్రతపై నిర్లక్ష్యం
అమరచింత: ప్రాజెక్టుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, జూరాల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల రోప్‌లు తెగినా సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించకపోవడం ఏమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రశ్నించారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును శుక్రవారం సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి జాన్‌వెస్లీ సందర్శించారు. జూరాల ప్రాజెక్టుపై తమకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఈఈ జుబేర్‌అహ్మద్, అధికారులతో సీపీఎం నాయకులు వాగ్వాదానికి దిగారు. తెగిపోయిన క్రస్ట్‌గేట్ల రోప్‌లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు జిల్లా రైతులకు వరప్రదాయినిగా నిలిచిన జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడటానికి పాలకులు చేసిన పాపలే కారణం ధ్వజమెత్తారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష ఎకరాలకు సాగునీరును అందించే ప్రాజెక్టుపై ఉదాసీనంగా వ్యవహరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
వాస్తవాలు వెల్లడించాలి
8 గేట్ల రోప్‌లు తెగిపోయి ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని, వెంటనే సీఎం జూరాల ప్రాజెక్టును సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించి వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. సొంత జిల్లాకు ఆయువుపట్టు లాంటి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ప్రతి ఐదేళ్లకొకసారి రోప్‌లు మార్చలేని స్థితిలో అధికారులు ఉన్నారని, ఇది పభుత్వ పనితీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. వాహన రాకపోకల కోసం బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం మంచి పరిణామం అని, కానీ కాగితాల వరకే పరిమితం కాకుండా వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని కోరారు.
క్రస్ట్‌గేట్ల రోప్‌లు తెగినా పట్టింపు లేదు
అధికారులతో వాగ్వాదం
సీఎం సొంత జిల్లాలో ఇంత నిర్లక్ష్యమా?
జూరాల ప్రాజెక్టు సందర్శనలో జాన్‌వెస్లీ