విద్యార్థి దశ కీలకమైంది | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి దశ కీలకమైంది

Mar 13 2025 11:37 AM | Updated on Mar 13 2025 11:32 AM

దేవరకద్ర: విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, వ్యసనాలకు బానిస కావొద్దని ఎస్‌ఐ నాగన్న అన్నారు. బుధవారం దేవరకద్ర జెడ్పీహెచ్‌ఎస్‌(బాలికల)లో సైబర్‌ క్రైం అవేర్‌నెస్‌, 100 డయల్‌, పొదుపు, పౌష్టికాహారం వంటి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం విద్య కోసం ఎంతో ఖర్చు చేస్తోందని, నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే లభిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్రమశిక్షణతో చదువుకోవాలని, సైబర్‌ నేరాలపై అవగాహన కలిగి సెల్‌ఫోన్లకు వచ్చే మెసేజ్‌లా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ గీత, ట్రైనింగ్‌ ఎస్‌ఐ కృష్ణాజీ, హెచ్‌ఎమ్‌ నాగేంద్రమ్మ పాల్గొన్నారు.

మెరుగైన విద్యా బోధన అందించేందుకు చర్యలు

మిడ్జిల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంఈ వెంకటయ్య అన్నారు. వస్పుల ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్న వెంకటయ్య మండల ఇన్‌చార్జి ఎంఈఓగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.మండలంలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎంఈఓను సన్మానించాయి. కార్యక్రమంలో కాంప్లెక్స్‌ హెచ్‌ఎం సరస్వతి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాజేందర్‌గౌడ్‌, నర్సింహులు, రమేష్‌, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

పది ఇసుక ట్రాక్టర్లపట్టివేత

దేవరకద్ర: గూరకొండ, నార్లోనికుంట్ల సమీపంలోని కోయిల్‌సాగర్‌ వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్ల పట్టుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఇసుకను నింపుకొని దేవరకద్ర వైపు వస్తుండగా పోలీసులు దాడిచేసి ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గత కొన్ని రోజులుగా ఆయా గ్రామాలను అడ్డాగా చేసుకుని పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రతి రోజు అర్థరాత్రి దాటితే వాగు ఇసుక ట్రాక్టర్లతో నిండి పోతుందని ఆరోపించారు. ఇసుక తరలింపును అరికట్టాలని పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రెండు ట్రాక్టర్లు..

మహమ్మదాబాద్‌: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని గోవిందపల్లి గ్రామ సమీపంలోని వాగు నుంచి బుధవారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు

మిడ్జిల్‌: మండలంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్‌ఐ శివనాగేశ్వర్‌ నాయుడు హెచ్చరించారు. బుధవారం కొత్తూర్‌ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మండలంలో ఇసుక అక్రమ రవాణాపై గ్రామస్తులు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

విద్యార్థి దశ కీలకమైంది 
1
1/2

విద్యార్థి దశ కీలకమైంది

విద్యార్థి దశ కీలకమైంది 
2
2/2

విద్యార్థి దశ కీలకమైంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement