టీజీ ఎన్పీడీసీఎల్‌కు రూ.10 కోట్ల నష్టం
హన్మకొండ: మోంథా తుపాను ప్రభావంతో టీజీ ఎన్పీడీసీఎల్‌కు దాదాపు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హనుమకొండ డివిజన్ పరిధిలోని నీట మునిగిన గోపాల్‌పూర్, యాదవనగర్ సబ్ స్టేషన్లను సందర్శించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎక్కడ విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని భారీ వర్షంలోనూ రేయింబవళ్లు పని చేసి సరఫరా పునరుద్ధరించామన్నారు. ఇప్పటి వరకు నీట మునిగిన 249 ట్రాన్స్‌ఫార్మర్లలో 246 పునరుద్ధరించామని, నీట మునిగిన 8 సబ్ స్టేషన్లలో 6 పునరుద్ధరించా మని, మిగతా 2 సబ్ స్టేషన్లకు ప్రత్యామ్నాయ వి ద్యుత్ సరఫరా అందించామని వివరించారు. 33 కే వీ ఫీడర్లు 44 ప్రభావితం కాగా 44 పునరుద్ధరించా మని,11 కేవీ ఫీడర్లు 116ల్లో సమస్యలు తలెత్తగా పరిష్కరించామన్నారు. 428 స్తంభాలు దెబ్బతిన్నాయన్నారు. తరచూ నీట మునిగే సబ్ స్టేషన్లను మా ర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం హనుమకొండ 100 ఫీట్ రోడ్‌లోని ప్రగతి నగర్ కాలనీ, మచిలీ బజార్ సెక్షన్ కాపు వాడలో జరుగుతున్న విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ ఆపరేషన్ టి.మధుసూదన్, హనుమకొండ ఎస్‌ఈ పి.మధుసూదన్ రావు, హనుమకొండ డి.ఈ సాంబరెడ్డి, ఎమ్మార్టీ, కన్‌స్ట్రక్షన్ డీఈ దర్శన్ కుమార్, ఎ.డి.ఈ మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షంలోనూ వేగంగా
విద్యుత్ పునరుద్ధరణ పనులు
సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి


