
డీటీఓ కార్యాలయంలో ఏజెంట్ల దందా..?
మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా రవా ణాశాఖ కార్యాలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఏడాది క్రితం కార్యాలయ అధికారులు లైసెన్స్‌ల జారీ కోసం ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు అనుమానం రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏజెంట్ల నుంచి రూ. 4,5100, అధికారి డ్రైవర్ నుంచి రూ.1,6500, జేఏ నుంచి రూ. 895 నగదును స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. అదే విధంగా కార్యాలయంలోనే ఓ అవుట్‌సోర్సింగ్ ఉ ద్యోగి మద్యం తాగడం వివాదాస్పదంగా మారింది. అలాగే డీటీఓగా బాధ్యతలు చేపట్టిన భద్రునాయక్‌పై ఆరోపణలు రావడంతో రాష్ట్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఇలా మానుకోట డీటీఓ కార్యాల యం పలు వివాదాలకు కేరాఫ్‌గా మారింది. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం 10గంటలకు లైసెన్స్ కోసం తాళ్లపూసపల్లికి చెందిన ఓ వ్యక్తి.. ఏజెంట్‌ను సంప్రదించగా డబ్బులు అధికంగా వసూలు చేశాడు. దీంతో మాటామాట పెరిగి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆ యువకుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. ఆర్డీఓ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో తనిఖీతో పాటు విచారణ చేపట్టారు. లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, ఇతర అవసరాల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజల నుంచి ఏజెంట్లు పనికో రేటు ఫిక్స్‌చేసి అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నిబంధనల ప్రకారం కార్యాలయంలో పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రశ్నించిన వారిపై దాడి
కలెక్టర్‌కు ఫిర్యాదు.. ఆర్డీఓ విచారణ