
శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025
– 4లోu
మూతబడే స్థాయి నుంచి..
కురవి: జిల్లాలోని కురవి మండలం కొత్తూరు(జీ) శివారు తాట్యతండా(ఖాసీంతండా) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత విద్యాసంవత్సరం ముగ్గురు విద్యార్థులు విద్యనభ్యసించారు. ఈ ఏడాది బడి తెరిచే నాటికి ఒక బాలిక గురుకులంలో సీటు రావడంతో వెళ్లిపోయింది. ఈ తరుణంలో ఇద్దరు విద్యార్థులు మాత్రమే మిగిలారు. దీంతో బడి మూతపడే స్థాయికి చేరింది. అయితే బడిని బతికించాలనే సంకల్పంతో హెచ్‌ఎం మంజుల బడిబాట కార్యక్రమాన్ని సక్రమంగా చేపట్టారు. అలాగే ప్రతీరోజు ఇంటింటికీ తిరిగి పిల్లలు ఎక్కడ చదువుతున్నారో వివరాలు తెలుసుకుని, వారు ప్రభుత్వ బడిలో చేరేలా తల్లిదండ్రులను ఒప్పించారు. ఎంఈఓ బాలాజీ సహకారంతో పాటు గ్రామ పెద్దలు, యువకులు, విద్యావంతులు మద్దతుగా నిలిచారు. ఇలా ఇద్దరు విద్యార్థులు ఉన్న పాఠశాల ప్రస్తుతం 23మందికి చేరింది. అలాగే మరికొంత మంది విద్యార్థులు బడిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా రు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఎంఈఓ బాలాజీ ఒక టీచర్‌ను డిప్యుటేషన్‌పై పంపించారు. ఇద్దరు టీచర్లు విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బడిని బాగు చేసేందుకు గ్రామానికి చెందిన పెద్దలు ముందుకు వస్తున్నారు. బడిని అందంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యారు.
న్యూస్‌రీల్

శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025