
రేపే కేయూ స్నాతకోత్సవం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈనెల 7న (సోమవారం) నిర్వహించనున్న స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. శనివారం కేయూలోని సెనేట్ హాల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వీసీ వివరాలు వెల్లడించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారని తెలిపారు. ముఖ్యఅతిథిగా శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్‌లోని ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన బోతున్నారని చెప్పారు. సోమవారం ఉదయం11గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హైదరాబాద్ నుంచి వరంగల్ నిట్‌కు చేరుకుంటారని అనంతరం బయలుదేరి 11:25గంటలకు కేయూకు రానున్నారని వెల్లడించారు. తొలుత స్నాతకోత్సవానికి సంబంధించి అకడమిక్ సెనేట్ సమావేశం జరుగనుందని తెలిపారు.
387మందికి పీహెచ్‌డీ పట్టాలు,
373 మందికి 564 గోల్డ్ మెడల్స్ ప్రదానం
కేయూలో 2020–25 జూన్ 30వరకు ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్స్, ఫార్మసీ, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషన్, లా, ఇంజనీరింగ్ విభాగాల్లో 387 మందికి గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్‌డీల ప్రదానం జరుగనుందన్నారు. అదే విభాగాలకు చెందిన 2016–21వరకు 373 మంది అభ్యర్థులకు 564 గోల్డ్ మెడల్స్‌ను కూడా స్నాతకోత్సవంలో ప్రదానం చేయనున్నారని వీసీ ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. స్నాతకోత్సవ వేడుకను అన్ని విభాగాల సహాకారంతో విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది సహకరించి విజయవంతవ చేసేలా సహకరించాలని వీసీ కోరారు. సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ పాల్గొన్నారు.
గవర్నర్ పర్యటన ఇలా..
ఈనెల 7న ఉదయం 8:30గంటలకు హైదరాబా ద్‌లోని రాజ్‌భవన్ నుంచి బయలుదేరి వరంగల్ నిట్‌కు 11గంటలకు చేరుకుంటారు. కొద్దిసేపు అక్కడే ఉండి ఉదయం 11:15 గంటలకు బయలుదేరి కాకతీయ యూనివర్సిటీకి 11:25 గంటలకు చేరుకుంటారు. ఉదయం 11:30గంటల నుంచి మధ్యాహ్నం 1:15గంటల వరకు స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
కలెక్టర్లతో సమావేశం
కేయూలో స్నాతకోత్సవం కార్యక్రమం ఉదయం 11:30గంటల నుంచి మధ్యాహ్నం 1:15 గంటలకు ముగియనుంది. అనంతరం కేయూ గెస్ట్‌హౌజ్‌లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 2గంటలకు కాకతీయ యూనివర్సిటీనుంచి బయలుదేరి 2:10గంటలకు వరంగల్ నిట్ చేరుకుంటారు. 2:30గంటల వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 2:30గంటల నుంచి మధ్యాహ్నం 3:15గంటల వరకు వరంగల్, హనుమకొండ కలెక్టర్ల సమావేశంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పాల్గొంటారు. యాక్షన్ ప్లాన్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ టీబీ టీబీ ఆఫీసర్లు, ఐఆర్‌సీఎస్ రీప్రెసెంటిటీవ్స్ పాల్గొంటారు. ఆ తర్వాత గవర్నర్ హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారని సమాచారం.
హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
పీహెచ్‌డీలు, గోల్డ్ మెడల్స్ ప్రదానం