
నో అడ్మిషన్ బోర్డు..
మహబూబాబాద్ అర్బన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు పంపించడానికి ఆసక్తి చూపుతున్నారు. అప్పులు చేసి లక్షల్లో ఫీజలు చెల్లిస్తున్నారు. అయితే ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మోడల్ స్కూల్‌లో నాణ్యమైన విద్య అందుతోంది. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నో అడ్మిషన్ బోర్డు పెట్టారు.
ఆదర్శం.. అనంతారం మోడల్ స్కూల్..
మానుకోట మున్సిపల్ పరిధి అనంతారం మోడల్ స్కూల్‌లో మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య, ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. అన్ని రంగాల్లో వి ద్యార్థులు ప్రతిభ చాటుతూ ట్రిపుల్‌ఐటీలో సీట్లు సాధిస్తున్నారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్,ఆర్మీ,నేవీ, పో లీసు ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నా రు. దీంతో మోడల్‌స్కూల్‌లో తమ పిల్లలను చది వించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.
నో ఆడ్మిషన్ బోర్డు ఏర్పాటు..
అనంతారం మోడల్ స్కూల్‌లో అడ్మిషన్ కావాలంటే ముందుగా అర్హత ప్రవేశ పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించాలి. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే అడ్మిషన్లు పూర్తయ్యాయి. సామర్థ్యం మేరకు అడ్మిషన్లు ఫుల్ కావడంతో నో అడ్మిషన్ బోర్డు పెట్టడం గమనార్హం. తమ పిల్లలకు అడ్మిషన్లు కావాలంటూ ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్, రాజకీయ నాయకుల వద్దకు సిఫార్సు వినతిపత్రాలు కోసం తల్లిదండ్రులు వెళ్తున్నారు. కాగా ఏటా డిమాండ్, సౌకర్యాల మేరకు అడ్మిషన్ల సంఖ్యను పెంచుతూ ఒక తరగతికి 100మంది విద్యార్థుల చొప్పున రెండు సెక్షన్లు ఏర్పాటు చేశారు. ఇంటర్‌లో గ్రూపునకు 40మంది చొప్పున విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతున్నాయి.
మోడల్ స్కూల్‌లో పూర్తిగా నిండిన సీట్లు
ఉత్తమ ఫలితాలు రావడంతో
విద్యార్థులు, తల్లిదండ్రుల ఆసక్తి