
రైతులకు విధిగా బిల్లులు ఇవ్వాలి
కర్నూలు(అగ్రికల్చర్): రైతులు కొనుగోలు చేసిన వాటికి విధిగా కంప్యూటరైజ్డ్ బిల్లులు ఇవ్వాలని, మాన్యువల్ బిల్లులు ఇవ్వరాదని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యాపారం చేసుకోవాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్నూలు ఉద్యాన భవన్‌లో కల్లూరు రూరల్, అర్బన్ పరిధిలోని పురుగుమందులు, విత్తనాలు, రసాయన ఎరువుల కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి డీలరు తమ షాపులో వ్యవసాయ శాఖ జారీ చేసిన లైసెన్స్‌ను బాగా కనిపించే విధంగా ప్రదర్శించాలన్నారు. రసాయన ఎరువులు, విత్తనాలకు సంబందించి ధరలు, స్టాక్ వివరాలను బోర్డుపై విధిగా నమోదు చేయాలని పేర్కొన్నారు. కర్నూలు సబ్ డివిజన్ ఏడీఏ సాలురెడ్డి, కల్లూరు మండల వ్యవసాయ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఆర్‌సీ ఏడీఏ వెంకటేశ్వర్లు, సాంకేతిక ఏవో శ్రీవర్ధన్‌రెడ్డి , వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి