
విద్యుత్ కోతలు.. ఎండుతున్న పంటలు
బనగానపల్లె: అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బనగానపల్లె మండలం ఇల్లూరుకొత్తపేట విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో తరచూ విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్ అధికారులు నివారణ చర్యలు చేపట్టడం లేదు. ఈ సబ్‌స్టేషన్ పరిధిలో ఇల్లూరుకొత్తపేట, మిట్టపల్లి, తమ్మడపల్లి విద్యుత్ ఫీడర్లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం తొమ్మిది గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలల పరిఽధిలో 250 వ్యవసాయ బోర్లు ఉండగా 1,300 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేయగా.. మిగతా పొలాల్లో మినుము, పత్తిని విత్తారు. మరి కొన్ని రోజుల్లో రైతులు మిరప కూడా సాగు చేయాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురవకపోవడం, గాలులు ఎక్కువగా ఉండటంతో మొక్కదశలో ఉన్న పైర్లు ఎండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో సక్రమంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు.
ఇదీ సమస్య..
● గత కొద్ది రోజులుగా మిట్టపల్లి విద్యుత్ ఫీడర్‌లో బ్రేకర్ సమస్యలు వస్తున్నాయి.
● త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా లేక ప్రజలకు మంచినీరు అందడం లేదు.
● విద్యుత్ సమస్య కారణంగా పొలాల్లో మోటార్లు పనిచేయక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
● కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ బిల్లులు మాత్రం ఉహించని విధంగా వస్తున్నాయని, కరెంట్ సరఫరా సక్రమంగా ఉండటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
చర్యలు చేపడుతున్నాం
కొన్ని సందర్భాల్లో సాంకేతిక లోపాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. సాంకేతిక లోపాలను తొలగించే చర్యలు చేపడుతున్నాం. రైతులకు ఎటువంటి ఇబ్బందులేకుండా విద్యుత్ సరఫరాను అందిస్తాం.
–గర్జప్ప, బనగానపల్లె విద్యుత్ రూరల్ ఏఈ
మొక్కజొన్న సాగు చేసిన రైతులకు తప్పని తిప్పలు
ఇబ్బందిగా ఉంది
రెండు వ్యవసాయ బోర్ల కింద 15 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. పైరు మొలకెత్తదశలో ఉండటంతో సాగునీరు అందించాలి. విద్యుత్ అందకపోవడంతో ఇబ్బందిగా ఉంది. పగలు సమయంలోనే త్రీఫేజ్ విద్యుత్ అందించాలి.
– పి వెంకటేశ్వర్లు, కాపులపల్లి
విద్యుత్ సరఫరాలో
అంతరాయం
వ్యవసాయబోర్ల ఆధారంగా కొద్ది రోజులుగా మొక్కజొన్న సాగు చేశాం. పైరుకు సాగునీ రు అవసరం. కనీసం తొమ్మిది గంటల పాటు విద్యుత్ అందించాలి. గత కొద్ది రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఇలాగైతే పైర్లు ఎండిపోతాయి.
– చంద్రశేఖర్‌రెడ్డి, ఇల్లూరుకొత్తపేట

విద్యుత్ కోతలు.. ఎండుతున్న పంటలు

విద్యుత్ కోతలు.. ఎండుతున్న పంటలు

విద్యుత్ కోతలు.. ఎండుతున్న పంటలు

విద్యుత్ కోతలు.. ఎండుతున్న పంటలు