
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
డోన్ టౌన్: ఒకే కాలనీలో ఐదు డెంగీ కేసులు నమో దు అయ్యే వరకు ఏమి చేస్తున్నారు.. విధుల్లో నిర్ల క్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. స్థానిక శ్రీనివాసనగర్‌లో డెంగీ కేసులు నమోదు కావడంతో శుక్రవారం ఆయన పట్టణంలో పర్యటించారు. ప్రజా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. తరచూ కాలనీలో పర్యటిస్తూ ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పలు కాలనీలో పారిశుద్ధ్యం లోపించడంతో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్‌తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట మలేరియా ఇన్‌చార్జ్ సత్యనారాయణ, డాక్టర్ బాలాజీ మహర్షి, వైద్య సిబ్బంది మధుసూదన్, అనంద్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ