
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
కర్నూలు: మొహర్రం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. గ్రామ పెద్దలు చిన్నాపెద్ద తేడా లేకుండా ఉత్తేజభరితంగా జరుపుకునే మొహర్రం వేడుకలలో అల్లర్లకు తావు ఉండరాదని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందరూ సోదరభావంతో మొహర్రం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. చట్ట విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. మొహర్రం వేడుకలను దృష్టిలో పెట్టుకుని గ్రా మాల్లో ముందస్తు భద్రత ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.
ఇంటర్ ఎస్సీ విద్యార్థులకు పోస్టల్ ఖాతాలు తప్పనిసరి
కర్నూలు(అర్బన్): ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎస్సీ విద్యార్థులచే పోస్టల్ ఖాతాలను తెరిపించాలని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక తెలిపారు. తల్లికి వందనం 2వ విడత నిధులు విడుదలవుతున్న దృష్ట్యా సహాయ సంక్షేమాధికారులు, కళాశాల కోఆర్డినేటర్స్, వసతి గృహ సంక్షేమాధికారులు, గ్రామ/వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లు తమ పరిధిలో అర్హత కలిగిన ఎస్సీ మొదటి సంవత్సరం ఇంటర్ చదువుతున్న విద్యార్థులను గుర్తించి వారి పోస్టల్ ఖాతాల ఆధార్ నెంబర్లకు ఎన్‌పీసీఐ లింకు చేయించాలన్నారు. ఇప్పటికే ఖాతాలు ఓపెన్ చేసిన వారు ఎన్‌పీసీఐ లింకును పరిశీలించుకోవాలన్నారు. అలాగే 9, 10వ తరగతికి సంబంధించి ఇంకా 98 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు ఎన్‌పీసీఐ పెండింగ్‌లో ఉందన్నారు. 257 మంది ఇంటర్ విద్యార్థుల మ్యాపింగ్ కూడా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 8లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలన్నారు.
ఇక ఇంటి నుంచే
తపాలా సేవలు●
● కర్నూలు డివిజన్ పోస్టల్
సూపరింటెండెంట్ జీ జనార్దన్‌రెడ్డి
కర్నూలు(అర్బన్): అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0 తో అనేక రకాల సేవలను ఇంట్లోను, సెల్‌ఫోన్ల నుంచి పొందే సౌలభ్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కర్నూలు పోస్టల్ సూపరింటెండెంట్ జీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ రకమైన సేవలను అమలు చేసేందుకు రాష్ట్రంలోని మచిలీపట్నం, విజయనగరంతో పాటు కర్నూలు డివిజన్ ఎంపికై ందన్నారు. శుక్రవారం స్థానిక హెడ్ పోస్టాఫీసులోని తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0ను ఈ నెల 8తేదీన కర్నూలు డివిజన్ పరిధిలోని 242 పోస్టాఫీసుల్లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ సేవలను ప్రారంభించేందుకు వీలుగా ఈ నెల 7వ తేదీన కర్నూలు హెడ్ పోస్టాఫీసుతో పాటు డివిజన్‌లోని 37 సబ్ పోస్టాఫీసులు, 204 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించబోమన్నారు. అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0ను సజావుగా, సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్తుందని నిర్ధారించుకునేందుకు తాత్కాలికంగా 7వ తేదీన అన్ని రకాల సేవలను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. వేగవంతమైన సర్వీస్ డెలివరీ, కస్టమర్‌కు స్నేహ పూర్వక సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పెరిగిపోతున్న సాంకేతికతకు అనుగుణంగా పోస్టల్ శాఖలో కూడా వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానంతో అనేక రకాల సేవలను అందించేందకు ‘ డాక్ సేవా ’ యాప్ కూడా అమల్లో ఉందన్నారు. జిల్లాలోని ఆదోని డివిజన్‌లో 192 పోస్టాఫీసులు ఉన్నాయని, అక్కడ ఈ నెల 22వ తేదీన ఏపీటీ 2.0 ప్రారంభం కానుందన్నారు.