
నీటి వనరుల ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించండి
కర్నూలు(సెంట్రల్): హైకోర్టు ఆదేశాల మేరకు నీటి వనరుల ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాలని అధికారులను జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదోని, కోసిగి, సీ బెళగల్, కోడుమూరులో నీటి వనరుల స్థలాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించి హైకోర్టులో కేసులు ఉన్నాయని, ఎప్పటికప్పుడు నివేదికలు పంపాల్సి ఉంటుందన్నారు. ఆయా ప్రాంతాల్లో అక్రమణలపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేఽశించారు. నీటి వనరుల స్థలాల్లో తాత్కాలికంగా వేసే గుడిసెలను తొలగించాలన్నారు. కార్పొరేషన్, మునిసిపాలిటీలు, పంచాయతీల్లో నీటి వనరులున్న ప్రాంతాల్లో భవననిర్మాణలకు అనుమతులు ఇవ్వకూడదని డీపీఓ, మునిసిపల్‌కమిషనర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పత్తికొండ ఆర్‌డీఓ భరత్ నాయక్, సమవేశంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, కర్నూలు మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, కర్నూలు ఆర్‌డీఓ సందీప్‌కుమార్, సర్వే ఏడీ మునికన్నన్, తహసీల్దార్లు రవికుమార్, మేష్‌బాబు, వెంకటలక్ష్మీ పాల్గొన్నారు.
అధికారులను ఆదేశించిన
ఇన్‌చార్జ్ కలెక్టర్ బి.నవ్య

నీటి వనరుల ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించండి